మీడియాకి బుద్ధి చెప్పిన సెహ్వాగ్..!

Thursday, November 24th, 2016, 11:32:27 AM IST

sewag
బాల్ ట్యాపరింగ్ కు పాల్పడ్డాడని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పై పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిటన్ మీడియా కోహ్లీ తీరుని తీవ్రంగా తప్పుపడుతోంది. రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ బాల్ టాంపరింగ్ కు పాలపడ్డాడని బ్రిటన్ మీడియా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యం లో పలువురు మాజీలు బ్రిటన్ మీడియాని తప్పుబట్టారు. మాజీ క్రికెటర్ విద్వాంసక వీరుడు సెహ్వాగ్ కూడా దీనిపై స్పందించాడు.తాము విదేశాల్లో చాలా సార్లు ఓడిపోయామని కానీ తాము తమ ఓటమిని నిజాయితీగా అంగీకరించమని అన్నాడు.

ఓ జాతీయ పత్రికతో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఓడిపోయిన జట్లు ఎప్పుడూ కొన్ని అంశాలని లేవనెత్తి లబ్ది పొందాలని చూస్తుంటాయని సెహ్వాగ్ అన్నారు. ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి అభ్యతరాలని లేవనెత్తలేదు కానీ ఆ దేశ మీడియా మాత్రం పిచ్చి రాతలు రాస్తోందని మంది పడ్డాడు. ఓటమిని సైతం గౌరవ ప్రదంగా అంగీకరించాలని సెహ్వాగ్ అన్నాడు. కోహ్లీ చూయింగ్ గమ్ లాంటిది నములుతూ తన నోటిలోని లాలాజలం తో బంతిని రుద్దుతున్నట్లు మొదటి టెస్టులో దృశ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోనే సెహ్వాగ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి.