ఆ నెలలో పుడితే ఇండియన్ టీం కెప్టెన్ అవ్వొచ్చు – సెహ్వాగ్ జోస్యం

Monday, July 9th, 2018, 03:01:15 PM IST

మాజీ భారత క్రికెట్ దిగ్గజ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కొన్నాళ్లక్రితం ఆయన బ్యాంకు ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా పెను సంచలనమే రేపాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఒక ఆసక్తికర ట్వీట్ మరొక సారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళితే ఇండియన్ మొన్న 7వ తేదీన పుట్టిన రోజుల జరుపుకున్న ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.

అలానే నిన్న 8వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్న మరొక మాజీ సారధి సౌరవ్ గంగూలీ, మరియు రేపు పుట్టిన రోజు జరుపుకోనున్న అలనాటి బ్యాట్స్ మాన్ మరియు అప్పటి కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఈనెల 10న పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనికి సంబంధించి సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ, ఇప్పటివరకు ఇండియన్ టీం కెప్టెన్లు అయిన వారిలో ధోని జులై7న, గంగూలీ జులై8న, మరియు గవాస్కర్ జులై 10న పుట్టిన రోజు జరుపుకోవడం యాదృచ్చికం అని, అయినప్పటికి తప్పకుండ మిస్ అయిన జులై 9న ఎవరు భవిష్యత్తులో ఇండియన్ టీం కెప్టెన్ కానున్నారో, అతను ఎవరు, మరియు ఎక్కడ పుట్టి ఉంటాడో అంటూ ఆసక్తికర ట్వీట్ చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments