ట్రెండింగ్ : అమ్మేదెమో టీ…ఆదాయం మాత్రం లక్షల్లో!!

Sunday, March 4th, 2018, 05:29:23 PM IST

ఒకింత తెలివితేటలు, కాస్త శ్రమ పడితే చాలు మనిషి ఏమైనా సాధించవచ్చు అనడానికి నిదర్శనం భారతీయ జనతాపార్టీ నేత, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి. నిజానికి ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆ పార్టీ ఆయన్ను ఒక చాయ్‌వాలాగా పేర్కొంది. మోడి కూడా తనను తాను చాయ్ వాలాగానే తనని తాను పరిచయం చేసుకున్నారు. అయితే తాజాగా ఒక చాయ్‌వాలా రికార్డు సంపాదనతో వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్రలోని పూణెలో యెవలె టీ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్న యెవలె అనే వ్యక్తి ప్రతీనెలా అక్షరాలా రూ.12 లక్షలు సంపాదిస్తున్నాడు.

నిజానికి ఇతను మొదట ఒక చిన్న టీ వ్యాపారి. అతను పెట్టె టీ రుచిచూడడం కోసం సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వస్తుండేవారు. ఇక అక్కడి నుంచి మెల్లగా అతని వ్యాపారం ఊపందుకుంది. అలా ఎదిగి ప్రస్తుతం ఆయన నెలకు రూ. 12 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆయన తన టీ హౌస్‌ను ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతటి ఉన్నత స్థాయికి రావడం సందర్భంగా యెవల్ మాట్లాడుతూ మేము టీ దుకాణం ద్వారా చేస్తున్నవ్యాపారం వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నాం. మేము తయారు చేసే టీ బాగుంటుంది కాబట్టే ఇంత ఆదరణ వచ్చింది అన్నారు. మాకు పూణెలో మూడు బ్రాంచీలున్నాయి. ప్రతీ బ్రాంచీలో 12 మంది సిబ్బంది ఉన్నారు అని తెలిపాడు….

  •  
  •  
  •  
  •  

Comments