సెమి ఫైనల్లో ఇండియా – పాకిస్తాన్.. గెలుపెవరిది?

Friday, January 26th, 2018, 02:00:54 PM IST


ప్రస్తుతం అండర్ 19 భారత యువ కెరటాలు మంచి అట తీరుతో ప్రపంచ కప్ లో రాణిస్తున్నారు. ఏ మాత్రం తడబడకుండా బౌలింగ్ – బ్యాటింగ్ లో సత్తా చాతుతున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన క్వాటర్ ఫైనల్లో బాంగ్లాదేశ్ ను ఓడించిన టీమ్ ఇండియా సెమి ఫైనల్ కు దూసుకెళ్లింది. బాంగ్లాదేశ్ కు ఏ దశలోనూ ఛాన్స్ ఇవ్వకుండా విజయాన్ని అందుకుంది. భారత్‌ 49.2 ఓవర్లకు ఆలౌటై 265 పరుగులు చేసింది. పృథ్వీ షా(40), శుభ్నమ్‌ గిల్‌(86), అభిషేక్‌ శర్మ(50) బ్యాటింగ్ లో సత్తా చాటి మంచి స్కోర్ ను అందించారు. ఇక 266 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేశారు. కోటి(3), శివమ్‌ మావి(2), అభిషేక్‌ వర్మ(2) సరైన సమయంలో వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను 42 ఓవర్ల వరకు అడ్డుకొని ఆలౌట్ చేశారు. ఇక భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ తో సెమి ఫైనల్ – 1 ఆడటానికి సిద్దపడింది. ఈ నెల 30న జరిగే ఆ మ్యాచ్లో పాక్ ను ఎలాగైనా ఓడించి భారత్ కి విజయాన్ని అందించాలని యువ ఆటగాళ్లు కసిగా ఉన్నారు. ఇక 29న జరగబోయే మరొక సెమీఫైనల్ 2 లో ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్‌ తలపడనున్నాయి.