సెన్సషనల్ న్యూస్ : వారు కోల్పోయింది అక్షరాలా రూ. 28 లక్షల కోట్లు !!!

Sunday, March 25th, 2018, 01:50:55 AM IST

ప్రపంచ కుబేరులలో చాలా మంది ఈ సంవత్సరం భారీ నష్టాలను చవిచూశారు. అందులో ప్రథముడు పేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్బెర్గ్. గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌ డేటా దుర్వినియోగం ఆరోపణల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ షేర్లు 14శాతం మేర నష్టపోయాయి.
ఆయన మొన్న జనవరి 26 నుండి ఇప్పటివరాక్ దాదాపు 10. 3 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్లు తెలుస్తోంది . ఈ పరిస్థితి వల్ల బ్లూమ్ బెర్గ్ బిలియనీర్లు సూచీలో ఆయన 4వ స్థానం నుండి అనూహ్యంగా 7వ స్థానికి పడిపోయారు. ఇక ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ 7 బిలియన్ డాల్లర్ల మేర నష్టపోయినట్లు సమాచారం.

బెర్కషైర్ హాథ్ వే చైర్మన్ వారెన్ బఫెట్, అలానే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 17 బిలియన్ డాలర్లు నష్టపోవలసి వచ్చింది. బ్లూమ్ బెర్గ్ సూచీ ప్రకారం 500 ప్రపంచ కుబేరుల మొత్తం సంపద ప్రస్తుతం 5. 2 ట్రిలియన్ డయలర్లుగా వుంది. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం నుండే అమెరికా మార్కెట్ లు తీవ్ర ఒడిడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు మొత్తంగా చూస్తే టాప్‌ 500 ప్రపంచ కుబేరులు 436 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 28.33లక్షల కోట్లకు పైమాటే. ఒక్క ఈ వారంలోనే ఆ 500మంది 181 బిలియన్‌ డాలర్ల నష్టాలను చవిచూశారు….