కోహ్లీ దమ్ముంటే అక్కడ ని సత్తా చాటు : మాజీ ఆటగాడు

Monday, January 22nd, 2018, 04:31:00 PM IST


గత కొంత కాలంగా వరుస విజయాలను నమోదు చేసుకున్న కోహ్లీ సేన కొత్త ఏడాది మాత్రం ఊహించని విధంగా అపజయాలను మూటగట్టుకుంది. సౌత్ ఆఫ్రికాతో ఆడిన మొదటి రెండు టెస్టు మ్యాచ్ లలో దారుణంగా ఓడిపోయింది. దీంతోకోహ్లీ కెప్టెన్సీపై పలు రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే కొంత మంది మాత్రం అతనికి సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా వెస్ట్ ఇండీస్ మాజీ క్రికెటర్ మైకెల్‌ హోల్డింగ్‌ కూడా విరాట్ పై ప్రశంసలను కురిపిస్తూనే ఒక సవాల్ విసిరాడు.

కోహ్లీ ఆటతీరు ఎన్నటికీ మారదు. అతను ప్రపంచంలోనే ది బెస్ట్ బ్యాట్స్ మెన్. కాకపోతే కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం అంతగా రానించలేదని కామెంట్స్ చేశాడు. గతంలో విరాట్ ఇంగ్లాండ్ గడ్డపై దారుణంగా విఫలమయ్యాడు. అయితే వచ్చే జూన్ లో టెస్ట్ వన్డే టీ20 సిరీస్ ల కోసం కోహ్లీ సేన అక్కడికి వెళ్లనుంది. వీలైతే కోహ్లీ ఆ సిరీస్ లో సత్తా చాటి ది బెస్ట్ అనిపించుకోవాలని మైకెల్‌ హోల్డింగ్‌ తెలియజేశారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ కూడా ప్రస్తుతం చాలా బలంగా ఉందని కూడా ఆయన వివరించారు.