79 కోట్ల అక్రమ సంపద.. ప్రముఖ జర్నలిస్ట్ దందా!

Friday, May 4th, 2018, 09:00:45 AM IST

టాక్స్ ఎగ్గొట్టే వాళ్లపై ఆదాయపు పన్ను శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఒక చోట కుబేరులు భయపడుతూనే ఉన్నారు. అందులో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఉండడం అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తోంది. రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా ప్రముఖ జర్నలిస్ట్ ఉపేంద్ర రాయ్ భారీగా అక్రమా సంపద ముడుపులు అందుకున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆ వార్త సంచలనం సృష్టించింది. కోట్లాది రూపాయల బ్లాక్ మనీని ట్రాన్సాక్షన్ ను పసిగట్టిన సిబిఐ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా తప్పుడు విధానంలో విమాన ప్రయాణాలను సులభతరం చేస్తున్నట్లు పసిగట్టిన అధికారులు ఉపేంద్ర రాయ్ కు సహకరించిన ఎయిర్ వన్ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఆ సంస్థ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రసూన్ రాయ్ పైన సిబిఐ ఆరోపణలు మోపడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉపేంద్ర రాయ్ కు గత ఏడాది 79 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ ఎకౌంట్ కు ట్రాన్స్ ఫార్ అయినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ వారు పెట్టిన కేసుల్ని మాఫీ చేయించేందుకు బ్రోకర్ గా వ్యవహరించి కొన్ని కంపెనీల నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఏయిర్ వన్ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి దాదాపు 1.02 కోట్లను అందుకున్న ఉపేంద్ర ఇతర కంపెనీల నుంచి 16 కోట్ల రుపాయలను అతి తక్కువ కాలంలో వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఇక సహారా కంపెనీ నుంచి కూడా 6.5 కోట్లు అందుకున్నాడు. అక్రమంగా వచ్చిన ఆ డబ్బుతో ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. ఫైనల్ గా లావాదేవీలు లెక్కకు మించి ఉండడంతో సిబిఐ అధికారులు ఆరా తీసి జర్నలిస్ట్ ఉపేందర్ రాయ్ అరెస్ట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments