జ‌బ‌ర్ధ‌స్త్ బ్రేకింక్.. కాంగ్రెస్‌లోకి ప్ర‌ముఖ నేత‌.. రాజకీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం..?

Sunday, October 14th, 2018, 10:10:50 AM IST

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ముఖ్యంగా తెలంగాణ‌లో సార్వత్రిక ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నుండ‌డంతో అక్క‌డ అధికార ప్ర‌తిప‌క్షాలు నువ్వా-నేనా అన్న‌ట్టు పోటీప‌డుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో వ‌రుస సర్వేలు కూడా తెర‌పైకి వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి. ఇక మ‌రోవైపు జంపింగ్‌లు, జాయినింగ్‌లు కూడా ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి పార్టీ మార‌నున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. గ‌త కొంత‌కాంలంగా నాయిని.. ఈ గులాబీ బాస్‌పై అసంతృప్తిగా ఉన్నార‌ని స‌మీచారం. అంతే కాకుండా రానున్న ఎన్నిక‌లు నేప‌ధ్యంలో నాయిని త‌న అల్లుడి శ్రీనివాస‌రెడ్డికి ముషీరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో టిక్కెట్ ఇప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ విష‌య మై కేసీఆర్‌ను క‌ల‌వాల‌ని నాయిని ప్ర‌య‌త్నిస్తున్నా.. కేసీఆర్ మాత్రం త‌న‌ను క‌లిసే అవ‌కాశం ఇవ్వ‌డంలేద‌ట‌. దీంతో కేటీఆర్‌ని క‌లిసి.. విష‌యం చెప్ప‌గా పక్కా హామీ ఇవ్వ‌క‌పోయినా.. త‌న‌కు చెప్ప‌కుండా ముషీరాబాద్ టిక్కెట్ ఎవ‌రికీ ఇవ్వ‌మ‌ని చెప్పార‌ట‌. దీంతో నాయ‌ని కొంత‌వ‌ర‌కు కుదుట‌పడినా.. అత‌ని వ‌ర్గీయులు మాత్రం.. ముషీరాబాద్ నుండి త‌న‌కి కానీ త‌న అల్లుడికి కానీ టిక్కెట్టు ఇవ్వ‌క‌పోతే పార్టీ మార‌డం మంచిద‌ని చెప్పార‌ట‌.

టీఆర్ఎస్‌లో ఇన్నేళ్ళు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసినా ఒక్క ఇక్కెట్ కూడా ఇప్పించుకోలోనే ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు.. ఇంకా పార్టీలో కొన‌సాగ‌డం అన‌వ‌స‌ర‌మ‌ని నాయ‌ని స‌న్నిహితులు కూడా సూచించార‌ట‌. అయితే నాయ‌ని మాత్రం త‌న‌కు అన్యాయం చేయ‌డ‌ని.. కేసీఆర్ పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని నాయ‌ని ధీమాగా ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే మ‌రోవైపు మాత్రం.. ఇప్ప‌టికే నాయ‌ని అల్లుడు కాంగ్రెస్ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నాడ‌ని.. దీంతో త్వ‌ర‌లోనే నాయ‌ని కాంగ్రెస్‌లోకి వెళ్ళ‌డం ఖాయ‌మ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ ట్రాల్ అవుతున్నాయి. మ‌రి ఒక‌వేల నిజంగానే నాయ‌ని కాంగ్రెస్‌లోకి వెళితే రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద క‌ల‌క‌ల‌మే అవ‌తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.