షాకింగ్ ఫ్లెక్సీ : వైఎస్సార్ పార్టీ ఫ్లెక్సీ లో ఎన్టీఆర్..!

Saturday, April 28th, 2018, 04:48:06 PM IST

ఒక పార్టీకి సంబందించిన వారు మరొక పార్టీ వారితో కలిస్తేనే ఆ పార్టీలో చీలికలు వచ్చాయని అప్పుడపుడు వార్తలు వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ పోరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. పార్టీనేతల మధ్య ఎప్పుడు ఎదో ఒక రకంగా వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. అయితే రీసెంట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ కి సంబందించిన ఫ్లెక్సీ లో సీనియర్ ఎన్టీఆర్ ఫొటో కనిపించడం అందరిని షాక్ కి గురి చేసింది. విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఓ వైపు సీనియర్ ఎన్టీఆర్ ఉండగా మరోవైపు వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. మధ్యలో వైఎస్ జగన్ అబ్బయ్య -కోడాలి నాని ఫొటోలున్నాయి. ఎన్టీఆర్ ఫొటో ఉండడంతో స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఫ్లెక్సీని తొలగిచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments