ఎన్టీఆర్ బయోపిక్ : అన్నగారి డైలాగులే వినిపిస్తాయా..?

Tuesday, November 13th, 2018, 08:22:58 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే, ఈ భాగానికి సంబందించిన షూటింగ్ పూర్తయింది. రెండవ భాగం మహానాయకుడు షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది, ఇది కూడా డిసెంబర్ 20కల్లా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారంట చిత్ర యూనిట్. “ఎన్టీఆర్ కథానాయకుడు” పార్ట్ లో ఎన్టీఆర్ నటించిన ఆనాటి చిత్రాల్లోని కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు క్రిష్. ఈ సీన్లకు సంబందించిన సంభాషణల వరకు పాత సినిమాల్లోని ఎన్టీఆర్ గొంతుకనే వడబోతున్నారట.

బొబ్బిలిపులి, దానవీర శూరకర్ణ వంటి సినిమాల్లోని డైలాగులు ఇప్పటికి మరపురానివే, నందమూరి అభిమానులకే కాకుండా, మాములు ప్రేక్షకులకు సైతం అవి బాగా గుర్తున్నాయి. ఉదాహరణకు దానవీర శూరా కర్ణ లోని “ఏమంటివి ఏమంటివి”, బొబ్బిలి పులి లోని కోర్టు సీన్లో డైలాగులు అన్నమాట. అలంటి సంభాషనలని బాలయ్య గొంతులో కంటే అన్న గారి గొంతులో వినిపిస్తేనే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నారట. అంటే మిగతా సంభాషణలు బాలయ్య గొంతులో, పాత సినిమా సీన్లకు సంబందించిన సంభాషణలు అన్నగారి గొంతులో వినబోతున్నాం అన్నమాట. మరి సినిమా డైలాగులు ఒకలా మిగిలిన సంభాషణలు మరోలా మారితే ప్రేక్షకులు ఎంతవరకు స్వీకరిస్తారో చూడాలి.