ఢీ10 : తారక్ కి కృతజ్ఞతలు తెలిపిన సీనియర్ నిర్మాత!

Saturday, July 28th, 2018, 01:14:33 PM IST

సౌత్ లో అత్యంత ఆదరణ పొందిన డ్యాన్స్ షో “ఢీ”. ప్రతి సీజన్ కు ఎంతో రసవత్తరమైన నృత్య పోటీలతో జనాలను ఆకర్షిస్తున్న ఈ డ్యాన్స్ షోకి సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. అయితే ఇటవల జరిగిన ఢీ10 కి స్పెషల్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ రాకతో 13.9 TRP రేటింగ్ తో ఈ షో రికార్డు సృష్టించింది. అందుకు తారక రాముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే.

మొన్నటివరకు ఎన్టీఆర్ రాకపై పలు రకాల రూమర్స్ వచ్చాయి. ఆయన 25 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ తారక్ ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదు. ఢీ10 షో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిపై తారక్ కి ఉన్న గౌరవం అలాంటిది. గత కొన్నేళ్లుగా తారక్ కి ఆ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. తారక్ చేసిన మొదటి సినిమా రామాయణంను శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ఎమ్.ఎస్ రెడ్డి గారు నిర్మించారు. చిన్నతనం నుంచి ఆ స్నేహబంధం ఉండడం వల్ల షోకి వచ్చిన ఎన్టీఆర్ కు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments