శ్రీ రెడ్డి సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తాడా..?

Thursday, April 12th, 2018, 02:20:38 PM IST

పుండు మీద కారం చల్లినట్టుగా ప్రతీ రోజు శ్రీ రెడ్డి, ఎవరో ఒకరిపైన లీక్స్ భాణాలు వేస్తుంది. ఇదే సందర్భంలో శ్రీ రెడ్డి సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తాడా..? అన్న ఈ ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలకు దారి తీస్తుంది. వివరాల్లోకి వెళితే తెలుగు సిని పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందని వర్ధమాన నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపధ్యంలో ఆమె ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శనతో నిరసన కూడా చెయ్యడంతో అటు జాతీయ స్థాయిలో కూడా పాపులర్ అయిపోయింది. జాతీయ పత్రికలు కూడా ఈమెపై కథనాలను రాసాయి. తాజాగా మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఆమె పలువురు ప్రముఖుల పేర్లను కూడా బయటపెడుతూ వస్తుంది. అటు వార్తా ఛానళ్ళు కూడా శ్రీ రెడ్డి విషయంలో కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. ఓయూ కాంపస్ కి కూడా వెళ్లి అక్కడి…విద్యార్థుల మద్దతు కూడగట్టిన ఈమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ కోరింది. ‘‘అన్నా.. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. దయచేసి మీరు స్పందించి తగిన న్యాయం చేయాలని పిలుపునీయండన్నా.. ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నా.. స్టేజీలపై ప్రజల గురించి గొప్పగా మాట్లాడే మీరు ఈ ఇష్యుపై ఒక్కసారి స్పందించాలన్నా’’ అంటూ పవన్ ని కోరింది.

  •  
  •  
  •  
  •  

Comments