రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సంచలన నిర్ణయం – తగ్గేదే లేదు అంటున్న కెసిఆర్

Friday, May 17th, 2019, 09:49:56 PM IST

తెలనగానా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల విషయంలో ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని సమాచారం. స్వతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా వైభవంగా జరపాలని కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్ద యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను గొప్పగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడానికి సులభ మార్గాన్ని ఎంచుకోవాలని కెసిఆర్ అన్నారు. అయితే స్వతంత్ర, గణతంత్ర, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పాత పద్దతిలోనే నిర్వహించాలా లేక ఏమైనా మార్పులు చేయాలా అనే విషయం మీద చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ వేడుకలకు విద్యార్థులను ఎండలో కవాతు చేపించడం లాంటి నిర్ణయాలను మానేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

అయితే ఈ వేడుకలను పరేడ్ గ్రౌండ్ వద్ద కాకుండా పబ్లిక్ గార్డెన్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో జరపాలని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రతిపాదించారు. అయితే పోలీసులు, విద్యార్థులతో కవాతు నిర్వహించే పద్ధతి చాలా రాష్ట్రాలు దూరంగా ఉంటాయని, తెలంగాణాలో కూడా అలాంటివి మానుకోవాలని సూచించారు. అంతేకాకుండా పతాకావిష్కరణ, ముఖ్య అతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వేడుకలపై సరైన నిర్ణయం తీసుకోని రెండు రోజుల్లో నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ఎస్.కె..జోషిని ఆదేశించారు.