షాకింగ్ న్యూస్ : శ్రీదేవి మృతిపై సంచలన ఫోరెన్సిక్ నివేదిక!

Monday, February 26th, 2018, 06:05:20 PM IST

మొన్న రాత్రి దుబాయ్‌లో హఠాన్మరణం పొందిన అతిలోక సుందరి శ్రీదేవి మృతికి సంబంధించిన ఎట్టకేలకు ఫోరెన్సిక్‌ నివేదిక అందచేసింది. ఈ మేరకు అక్కడి అధికారులు పోలీసులకు ఫోరెన్సిక్‌ నివేదికను అందజేశారు. ఆ నివేదిక లోని అంశాలను యూఏఈ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు అనుకున్నట్లు ఆమె గుండెపోటు కారణంగా చనిపోలేదు అంతే కాక ఆమె మరణం వెనుక ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్టు నిర్థారించింది. బహుశా పెళ్లి విందు సందర్భంగా ఆమె మద్యం సేవించిన ఉంటారు.

ఈ నేపథ్యంలో బాత్రూమ్‌వెళ్లిన ఆమెకు గుండెపోటు రావడంతో బాత్‌టబ్‌లో పడి మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆమెను నీటి టబ్బులో నుంచి బయటకు తీసే సమయానికే శరీరం కొంత ఉబ్బిపోయి ఉన్నట్లు వారు నివేదికలో పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం శనివారం సాయంత్రం పార్టీ నుంచి హోటల్‌లో గదికి వెళ్లిన శ్రీదేవి 7గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌కు వెళ్లారు. అందులోనే అనుకోకుండా కాలు జారీ నీళ్ల టబ్‌లో పడిపోయారు. ఆ సమయంలోనే ఆమె తీవ్ర కంగారుకు, ఆందోళనకు లోనై గుండెపోటు వచ్చి టబ్‌లో నుంచి పైకి లేవలేక, ఊపిరి ఆడక ఆమె తుది శ్వాస విడిచారు. అయితే, ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఆమె భర్త బోనీ కపూర్‌ హోటల్‌ గదికి వచ్చారు.

ఎంత కొట్టి చూసినా శ్రీదేవి బాత్‌ రూం తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోపక్క ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం నివేదికను కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వడంతో ఈ మేరకు ఆమె భౌతికకాయాన్ని ప్రత్యేక జెట్‌ విమానంలో భారత్‌కు తరలించేందుకు ఇమ్మిగ్రేషన్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రాత్రికి శ్రీదేవి పార్థివదేహం ముంబయికి చేరుకోనుంది. అనంతరం ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. రేపు శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీదేవికి చెందిన భాగ్య బంగ్లాలో అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు…