ప్రణయ్ హత్యకు కారణమైన మారుతీరావు అవినీతి చిట్టా..!

Tuesday, September 18th, 2018, 11:35:52 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి రాక్షసుడిలా మారి తన కన్న కూతురు భర్తనే కడ తేర్చిన కసాయి తండ్రి యొక్క అసలైన జీవితం మొత్తం ఇప్పుడు బయటకు వస్తుంది.మారుతీరావు యొక్క జీవిత చరిత్రలో ఒక్కో భాగం బయటకు వస్తుంది,ఆయన కరుడు గట్టిన రాక్షసుడే కాదు నిస్సహాయుల పాలిట అవినీతిపరుడు అని కూడా అతని వల్ల అన్యాయం అయిన బాధితులు తెలుపుతున్నారు.

అధికారుల అండదండలతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని ఎక్కడ భూములు కనపడినా వాటిని మారుతీరావు అతని తమ్ముడు కలిసి అన్యాయంగా ఖబ్జా చేసేవారని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.ఒక సాధారణ కిరోసిన్ డీలరు స్థాయి నుంచి ఇప్పుడు ఏసీ కార్లలోనూ మిర్యాలగూడ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద బంగ్లాలు ఎలా ఉంటున్నాడు, దానికి కారణం అతను చేసిన ఎన్నో అక్రమాలకూ ఇవే నిదర్శనం అని తెలుపుతున్నారు.మారుతీరావు యొక్క అవినీతికి అక్కడి ఏ ప్రభుత్వ అధికారులను ఐనా సరే తన గుప్పిట్లో పెట్టుకోవడానికి వారికి డబ్బు,కానుకలు, వారికి స్త్రీ వ్యామోహాలను ఆశ చూపించి లోబరుచుకుంటాడు అని,పూట గడవడానికే అతి కష్టంగా ఉండే స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు 400 కోట్ల అక్రమాస్తులు సంపాదించుకున్నాడు అని తెలుపుతున్నారు.

ముఖ్యంగా అతను ఎస్సీ మరియు ఎస్టీ వారి భూములను, ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను ఎక్కువగా ఖబ్జా చేసేవాడు అని ఎవరైనా ఎదురు తిరిగితే వారిని అతని యొక్క అనుచరులతో భయ భ్రాంతులకు గురి చేసేవాడు అని వాటి తాలూకా రికార్డులను కూడా తగులబెట్టి మాయం చేసి మరి అన్యాయంగా భూములు స్వాధీనం చేసుకునేవాడు అని మారుతీరావు అనుచరులు తెలుపుతున్నారు.