సెన్సేషనల్ న్యూస్ : భార్యకు కొత్త జీవితం అందించిన భర్త

Monday, March 12th, 2018, 11:00:46 AM IST

నేటి ఆధునిక ప్రపంచంలో కొందరు మగవాళ్ళు పెళ్లి అయిన మొదటి రోజునుండి భార్యను అదనపు కట్నం కోసం ఇబ్బందిపెట్టడం, లేదా తనకు నచ్చినట్లు భార్యప్రవర్తించాలని ఆమెను లేనిపోని విధంగా ఇబ్బందులపాలు చేయడం వంటివి జరగటం చూస్తున్నాం. అలా అని అందరూ మగవారు ఇలానే చేస్తారు అని అనలేము, కొందరు మంచి వారుకూడా లేకపోలేదు. కానీ అందుకు భిన్నంగా ఒక భర్త తన భార్యను ఆమెకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఓడిశా రాష్ట్రంలోని సుందర్‌ఘడ్ జిల్లా బర్గామ్ బ్లాక్ పరిధిలోని పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో (28) అనే యువకుడు జార్సుగూడ ధేబ్బి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని మార్చి 4వతేదీన వివాహం చేసుకున్నాడు.

పెళ్లి అనంతరం వధువు బావ అయిన మరో యువకుడు వచ్చి వధువు తో పెళ్లి ఎందుకు చేసుకున్నావంటూ గొడవపడ్డాడు. ఈ విషయం బయటకు చివరికి ఆమె భర్తకు తెలిసింది. అయితే పెళ్లికి ముందే తన భార్య అతని బావను ప్రేమించిందని తెలుసుకొని అతని బావమరుదులతో మాట్లాడి తన భార్యకు ప్రియుడైన బావతో పెళ్లి జరిపించాడు. పలువురు అతిధుల సమక్షంలో భార్యకు భర్త చేసిన ఈ వివాహ వేడుకకు పామర గ్రామ ప్రజలు,ఆ గ్రామ సర్పంచ్ గజేంద్రబాగ్ కూడా మద్ధతు తెలిపారు. పెద్దమనసుతో భర్త భార్యకు ప్రియుడినిచ్చి పెళ్లి జరిపించడం అభినందనీయమని పామర గ్రామస్థులు బాసుదేవ్‌ను అభినందిస్తున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments