సెన్సేషనల్ న్యూస్ : ఆ కోడికి తల లేదు, కానీ బ్రతికే వుంది!

Thursday, March 29th, 2018, 01:14:12 PM IST

వాస్తవానికి మనకి శరీరంలో ముఖ్యభాగం తలకాయ. అయితే ఒకవేళ ప్రమాధవశాత్తు తలతెగిపడినా, లేక మరి ఏ కారణం చేతనో తలను కోల్పోతే ఇక ఆ మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు. అయితే ఇందుకు భిన్నంగా ఒక కోడి మాత్రం తన తల తెగినా సరే కొద్దిరోజుల జీవనం సాగిస్తోంది. అదేంటో చూడండి. కొద్దిరోజుల క్రితం ఒక జంతువు దాడిలో తల తెగిపడిన కోడిపెట్ట వారం రోజులుగా బతికి ఉండడం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సెంట్రల్ థాయ్ లాండ్ లోని రాట్చ్ బురిలో వారం క్రితం ఒక కోడి మరో జంతువు దాడిలో తలను కోల్పోయింది. అయినప్పటికీ గత కొద్దిరోజులుగా అది నడుస్తుండడంతో దానిని స్థానిక వెటర్నరీ సర్జన్ దత్తత తీసుకున్నారు. దానికి మెడ ద్వారా డ్రాప్స్‌ రూపంలో ఆహారం అందిస్తున్నారు. అలాగే వ్యాధులకు గురికాకుండా యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. తన చికిత్సకి కోడి బాగా స్పందిస్తోందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి….