ఈ ఐపీఎల్ లో సంచలన రికార్డు నమోదు!

Saturday, May 19th, 2018, 01:39:16 AM IST


ఐపీఎల్ అంటేనే క్రికెట్ ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవాలి. అత్యధికంగా ఫోర్లు, సిక్సర్ల వర్షం ఈ ఫార్మాట్ క్రికెట్ లో కురుస్తూనే ఉంటుంది. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ పొట్టి క్రికెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ 11వ ఐపీఎల్ సీజన్లో కనీవినీ ఎరగని ఒక సంచలన రికార్డు నమోదు అయింది. అదేమిటంటే, ఇప్పటివరకు జరిగిన 10 ఐపీఎల్ సీజన్లలో కంటే ఈ ఐపీఎల్ లో ఇంకా లీగ్ దశలో వున్న మ్యాచ్ లు పూర్తి కాకముందే ఇప్పటివరకు జరిగిన 51 మ్యాచ్ లు ముగిసేసరికి 748 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఒక ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన సీజన్ గా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నిలిచింది. కాగా 2012 ఐపీఎల్ లో మొత్తం 75 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లు 732 సిక్సర్లు బాదారు.

అయితే ఈ ఐపీఎల్ లో ఇన్ని సిక్సర్లు కొట్టడానికి ముఖ్య కారణం దాదాపుగా అన్ని జట్లలోని ప్రధాన ప్లేయర్లు చాలావరకు ఫామ్ లో ఉండడం ఒక కారణమైతే, మరికొన్ని జట్లలో వన్ డౌన్, టూ డౌన్ ఆటగాళ్లు, అల్ రౌండర్ లు సైతం భారీగా సిక్సర్లు బాదడం మరొక కారణంగా చెప్పవచ్చు. ఇక జట్టు ప్రకారం చూస్తే చెన్నై అత్యధికంగా 116 సిక్సర్లు కొట్టిన జట్టుగా ప్రధమ స్థానంలో ఉంటే, సన్ సైజెర్స జట్టు అతయల్పంగా 62 సిక్సర్లు మాత్రమే కొట్టిన జట్టుగా అట్టడుగున నిలిచింది.

జట్ల వారీగా అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు :
చెన్నై – 116
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: 104
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : 107
డిల్లీ డేర్‌డెవిల్స్‌: 99
ముంబై ఇండియన్స్‌: 98
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: 96
రాజస్థాన్‌ రాయల్స్‌ : 66
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: 62

  •  
  •  
  •  
  •  

Comments