జగన్ పై హత్య కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు..ఏమిటవి..?

Monday, October 29th, 2018, 02:45:44 PM IST

మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పై శ్రీనివాసరావు అనే యువకుడు కోళ్ల పందాలకు వినియోగించే కత్తితో హత్యా ప్రయత్నం చేసిన సంగతి తెలిసినదే.అయితే ఇప్పుటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు.దాడికి పాల్పడిన వ్యక్తి మీ పార్టీకి చెందిన వాడు అంటే మీ పార్టీకి చెందిన వాడు అని ఒకరి మీద ఒకరు ఆరోపిస్తున్నారు.ఇప్పుడు ప్రస్తుతం దాడికి పాల్పడినటువంటి శ్రీనివాసరావు పై ప్రత్యేక పోలీసు సిబ్బంది విచారణ చేస్తున్నారు.ఇప్పుడు ఆ విచారణ రెండవ రోజుకు చేరుకుంది,అయితే సిట్ వారి పోలీసు విచారణలో కొన్నిసంచలన నిజాలు శ్రీనివాసరావు బయటపెట్టినట్టు తెలుస్తుంది.ఇప్పటికే శ్రీనివాసరావు తో పాటు అతనికి సహకరించినటువంటి అతని సిబ్బందిలో కొంత మందిని కూడా అడువులోకి తీస్కొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే శ్రీనివాసరావు ఈ కొద్ది నెలల్లోనే నాలుగు మొబైల్ ఫోన్లు మరియు మూడు బ్యాంకు అకౌంట్లు కూడా కలిగి ఉన్నట్టు తెలుస్తుంది.వాటిలో ఒకటి విశాఖపట్నంలోనూ మరియు మరొకటి ముమ్మిడివరంలోను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాకుండా ఆ నిందితుడు కాల్ డాటాలో కూడా కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయని వారు తెలుపుతున్నారు,అతను కొంత మంది ముఖ్య నేతలతో మాట్లాడేటప్పుడు మాత్రం అతని సొంత నంబరు ను వినియోగించకుండా అతని బంధవుల యొక్క ఫోన్ నుంచి మాట్లాడేవాడు అని తెలుస్తుంది.అయితే ఈ రోజు అతన్ని పూర్తిగా విచారించి సాయంత్రం మీడియా ముఖంగా మిగిలిన నిజాలను ఏమిటి అనేవి తెలుపుతామని సిట్ సిబ్బంది తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments