ఒకే గంటలో ఆవిరైపోయిన 2 లక్షల కోట్లు…

Wednesday, March 7th, 2018, 01:53:15 AM IST

ఎన్నోరోజుల తర్వాత సెన్సెక్స్‌ ఒక్కసారిగా దిగువకు జారిపోయింది. కేవలం ఒక గంటలోనే అర కాదు ఒకటికాదు ఏకంగా 2లక్షల కోట్లకు దిగిపోయింది. ప్రైవేటు రంగ అతి పెద్ద బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవోలకు సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టి‌గేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) అధికారులు ఉన్నట్టుండి నోటీసులు జారీ చేయడంతో మార్కెట్‌ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. దీనికి తోడు స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతిపై అమెరికా విధించిన పన్నుతో ఆసియా మార్కెట్లు నష్టవాతకు గురయ్యాయి. దాని ఫలితం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పడింది. ఈరోజు ఉదయం లాభాలతో మొదలైన ట్రేడింగ్‌ సాయంత్రం అయ్యేసరికి నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో సెన్సెక్స్‌ 430 పాయింట్లు నష్టపోయి 33,317కు, నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో 10249 కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా దాదాపు రూ. 2లక్షల కోట్ల మేరకు సంపన్నుల సంపద అర్థాంతరంగా ఆవిరైపోయింది.

సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టి‌గేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) అధికారులు ఎన్నో రోజులుగా వేచి చూస్తూ సమయం చూస్కొని, పీఎన్‌బీ స్కాంలో ముఖ్యమైన నిందుతుడైన మోహిల్‌ చౌక్సీకి చెందిన గీతాంజలి జమ్స్‌కు రూ.5,000 కోట్ల రుణం పొడిగింపుపై ఎస్‌ఎఫ్‌ఐఓ ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్‌కు, యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మాకు నోటీసీలు జారీ చేయాలని నిర్ణయం గావించింది. ప్రైవేటు బ్యాంక్‌ షేర్లను భారీగా విక్రయించిన కారణాన, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 1.31శాతం పడిపోగా. మరో పక్క ఎస్‌బీఐ షేర్‌ కూడా 3శాతం పడిపోవడంతో ఇండెక్స్‌ కూడా దెబ్బ తిన్నది..

ఇవన్నీ ఇలా ఉంటే స్టాక్‌ మార్కెట్లలో చాలా షేర్లు ఫండమెంటల్స్ తో పోల్చుకుని చూస్తే అధిక విలువతో ట్రేడవుతున్నాయి. దీంతో అవి వాటి ఫండమెంటల్స్ ను చేరుకునే సమయంలో అవి వాటి విలువలకు కోల్పోతున్నాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ క్రిందటి రావడానికి జీడీపీ వృద్ధిరేటు పెరిగితే ఫండమెంటల్స్ కూడా అభివృద్ధి చెంది అధిక విలువను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

ఇవన్నీ ఇలాగుంటే ఒకవైపు భారత్‌ ఆర్థిక వ్యవస్థ అస్తావ్యస్త పరిస్థితిలో ఉందని ఆక్స్ ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ పేర్కొంది. క్రమక్రమంగా కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ దేశానికి ముప్పుగా మారుతుందని, అధికారులు సమస్య దరి చేరకముందే అప్రమత్తమై తగు చర్యలు తీస్కోవాలని హెచ్చరికాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ద్రవ్యలోటు కలిగిన దేశంగా ఉందని చెప్పింది. ఈ నివేదిక ప్రకారం భారత స్టాక్‌ మార్కెట్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపడం జరిగింది.

అమెరికా యూరోప్‌ మధ్య వాణిజ్య సమరం..

ఒక పక్క భారత్‌ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్న పరిస్థితిలో ఉంటే మరో పక్క స్టీల్‌ దిగుమతులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొనడంతో వాణిజ్య యుద్దానికి స్వాగత సమరం రూపు దిద్దుకుంది. దీనికి యూరోపియన్‌ యూనియన్‌ దీటుగా స్పందించి మీరు ఇలాంటి ఆలోచన లేని నిర్ణయాలు తీస్కుంటే, తాము కూడా అమెరికా వస్తువులపై భారీగా పన్నులు విధిస్తామని.. అది యూఎస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఈయూ పార్లమెంట్స్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిటీ అధ్యక్షుడు పేర్కొన్నారు. దీంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 3.5 బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించే అవకాశం ఉన్నదని నిపుణుల అంచనా. ఏదెలా ఉన్న ఒక్కసారిగా సెన్సెక్స్ ఇలా కుంగిపోవడం దేశ ఆర్ధిక వ్యవస్థకు చాల దెబ్బ.