అబద్ధాల కోరు.. దొంగ : అంపైర్‌ పై సెరెనా ఆగ్రహం!

Sunday, September 9th, 2018, 08:28:05 PM IST

స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ కు కోపం కట్టలు తెచ్చుకుంది. ఆటలో చైర్‌ అంపైర్‌ చెప్పిన విధానానికి కట్టుబడి ఉండే ప్లేయర్స్ పెద్దగా ఎదురుసమాధానం చెప్పరు. కానీ సెరెనా ఊహించని విధంగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు అబద్దం ఆడుతున్నావ్.. దొంగ అంటూ చైర్‌ అంపైర్‌ పై ఆమె మండిపడటం ప్రపంచ టెన్నిస్ అభిమానులను షాక్ కి గురి చేసింది. రీసెంట్ గా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ పోటీలు జరిగాయి.

అయితే అందులో సెరెనా ఆట నియమాలను ఉల్లఘించిందని ఆట మధ్యలో కోచ్ సలహాలు తీసుకోవడం విరుద్ధమని చైర్‌ అంపైర్‌ ఆరోపించాడు. అయితే తాను మోసానికి పాల్పడలేదని సెరెనా విలియమ్స్ వాగ్వివాదానికి దిగింది. అనంతరం రెండో సెట్ లో చైర్‌ అంపైర్‌ ఒక పాయింట్‌ జరిమానా విధించాడు. తరువాత సెరెనా 2-6, 4-6 తేడాతో జపాన్‌ క్రీడాకారిణి ఒసాకా చేతిలో ఓటమి చెందింది. దీంతో ఆగ్రహం పట్టలేక గ్రౌండ్ లో తన బ్యాట్ ను ఆమె నెలకోసి కొట్టింది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments