సత్తా చూపిన అమెరికా నల్లకలువ

Monday, September 9th, 2013, 12:00:12 PM IST

Serne
అమెరికా నల్లకలువ యూఎస్ ఓపెన్ టైటిల్ ను గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అజరెంకాను చిత్తు చేసి 5వ సారి యూఎస్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచింది. గత ఏడాది ఫైనల్ మ్యాచ్ రిపీట్ అవుతుందన్న అభిమానుల గెస్ నిజమైంది. 2012లో టైటిల్ గెలిచిన సెరేనా ఈసారి కూడా విజేతగా నిలిచి వరుసగా రెండో సారి.. ఓవరాల్ గా 5వ సారి ఈ ఘనత సాధించింది.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ రసవత్తరంగా జరిగింది. నెంబర్ వన్ సీడ్ సెరేనా విలియమ్స్ నెంబర్ టూ సీడ్ , బెలారస్ బ్యూటీ విక్టోరియా అజరెంకాల మధ్య ఫైనల్ హోరాహరీగా సాగింది. టాప్ టూ ప్లేయర్స్ మధ్య పోటీ అవడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది…అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఇరువురు అద్బుతమైన ఆటతీరు కనబరిచారు. తొలి సెట్ లో సెరేనా విలియమ్స్ దూకుడు కొనసాగగా….రెండో సెట్లో అజరెంకా రెచ్చిపోయింది. సెరేనా సర్వీసులను బ్రేక్ చేసిన అజరెంకా రెండో సెట్ ను గెలుచుకుంది.. ఐతే మూడో సెట్లో అజరెంకా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో సెరేనా మూడో సెట్ ను 6-1 తేడాతో గెలిచింది.. మొత్తానికి వరుస మూడు సెట్లలో 7-5, 6-7, 6-1 తేడాతో సెరెనా విజయం సాధించింది.

యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సెరేనా ఆనందంలో మునిగి తేలింది. యూఎస్ ఓపెన్ విజేతగా 5వ సారి నిలవడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇక తన ప్రత్యర్థిని సైతం పొగడ్తలతో ముంచెత్తింది. అజరెంకా అద్బుతంగా ఆడిందని.. ఆమె అత్యంత బలమైన ప్రత్యర్థి అంటూ కొనియాడింది. ఇక రన్నరప్ గా నిలిచిన బెలారస్ భామ అజరెంకా.. సెరేనాపై ప్రశంసలు కురిపించింది.. బెస్ట్ ప్లేయర్ తో ఫైనల్ ఆడటం గొప్పగా ఉందని చెప్పింది…రన్నరప్ గా నిలిచినా.. ఇది తనకు గొప్ప ఓటమి అని అభివర్ణించింది. విజయానికి సెరేనానే అర్హురాలని చెప్పింది.

మొత్తానికి 2012 యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ రిపీట్ అయినప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం మరోసారి మాంచి కిక్కున్న గేమ్ ను ఎంజాయ్ చేశారు.