16 ముక్కలుగా వాయుసేన అధికారి శరీరం..పసిగట్టిన కుక్కలు..!

Wednesday, February 22nd, 2017, 12:20:39 PM IST


భారతీయ వాయు సేనలో దారుణం చోటు చేసుకుంది.భిసియానా ఎయిర్ బేస్ లో విపన్ శుక్లా (27) అధికారిగా పనిచేస్తున్నాడు. శుక్లా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు కలసి దారుణంగా హత్య చేసారు. శుక్లాన్ని 16 ముక్కలుగా నరికి 16 సంచుల్లో ప్యాక్ చేసి దాచిపెట్టారు. 2014 నుంచి శుక్లా వాయుసేనలో ఉద్యోగం చేస్తూ ఉత్తరప్రదేశ్ లోని గొండా ప్రాంతంలో ఉంటున్నారు. అదే ఎయిర్ బేస్ లో చిన్న ఉద్యోగిగా పనిచేస్తుయన్న సులేష్ కుమార్ భార్య తో శుక్లా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం బయటపడడంతో పట్టరాని కోపంతో సులేష్ మరియు అతని కుటుంబసభ్యులు శుక్లాని అతికిరాతకంగా నరికి ముక్కలు చేశారు. శుక్లా శరీరభాగాలు సంచుల్లో ఉంచి ఇంట్లోనే దాచిపెట్టారు.

భర్త కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని భార్య పోలీస్ లకు పిర్యాదు చేసింది. దీనితో ఎయిర్ బేస్ లోని ఇళ్లను పోలీస్ లు పరిశీలించడం ప్రారంభించారు. పోలీస్ కుక్కలు సులేష్ ఇంటివైపు పరుగు తీయడం ప్రారంభించాయి. దీనితో అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీస్ లు శుక్లా శరీర భాగాలను కనుగొన్నారు. దీనితో సులేష్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ బేస్ కు వచ్చిన కొత్తల్లోనే శుక్లాకు, సులేష్ భార్య అనురాధ పటేల్ కు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం పసిగట్టిన సులేష్.. శుక్లా ని హతమార్చాలని పథకం రచించాడు. తాను ఇల్లు మారుతున్నాని సామాగ్రిని తీసుకెళ్లేందుకు సాయం చేయాలని సులేష్ శుక్లాన్ని కోరాడు. ఈ విషయం నమ్మి అతని ఇంటికి వెళ్లిన శుక్లాన్ని కత్తితో దారుణంగా హతమార్చాడు. ఈ నెల 19 న హత్య జరిగినట్లు పోలీస్ లు గుర్తించారు.