టీఆరెస్ లో చేరిన సినీ, సీరియల్ నటి!

Saturday, September 15th, 2018, 05:30:30 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టీఆరెస్ పార్టీలకు సంబందించిన మీటింగ్ లు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ సూచించిన ఎన్నికల వ్యూహ రచనలపై నేతలు చర్చలు జరుపుతున్నారు. తప్పకుండా అవకాశం ఉన్న స్థానాల్లో గెలిచి తీరాలని టీఆరెస్ నేతలు ఫిక్స్ అయ్యారు. ఇకపోతే పార్టీలో నేతల చేరికలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సినీఫీల్డ్ నుంచి ఎవరు వచ్చినా కూడా పార్టీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి.

ఇక రీసెంట్ గా ఉమాదేవి కూడా పార్టీలో చేరారు. సినిమాల్లో అలాగే సీరియల్లో నటిస్తున్న ఉమాదేవి టీఆరెస్ కండువా కప్పుకున్నారు. టీఆరెస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కూకట్ పల్లిలోని పార్టీ కార్యలయంలో జరిగిన నేతల మధ్య జరిగిన కార్యక్రమంలో ఉమాదేవికి పార్టీ కండువా కప్పి సాదరంగా నేతలు ఆహ్వానించారు. పార్టీ గెలుపుకోసం అలాగే కృష్ణారావు విజయానికి తప్పకుండా కృషి చేస్తానని ఉమాదేవి మాట్లాడారు. ఇక కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరిని ఆకర్శిస్తున్నాయని అందుకే పార్టీలో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు కృష్ణారావు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments