పవన్ vs కత్తి మహేష్ వివాద ముగింపుకు చంద్రబాబు సలహా ?

Wednesday, January 10th, 2018, 08:02:42 AM IST

పవన్ కళ్యాణ్ మరియు కత్తి మహేష్ ల మధ కోల్డ్ వార్ రోజు రోజుకు అంతకంతకు పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గేలా లేదు, పరోక్షంగా కత్తి మహేష్ పై ట్వీట్ చేసి పూనమ్ కౌర్ ఈ వివాదం లో ఎలా ఇరుక్కుందో, కత్తి విమర్శలకు ఎలా బలి అయిందో చూశాము. తదుపరి కోనవెంకట్ కూడా పవన్ కి వ్యతిరేకంగా మాట్లాడవద్దని, సైలెంట్ గా ఉండమని, అంతటితో ఆగకుండా ఆయనని ఒక జోకర్ అని కూడా అన్నారు. దానికి ప్రతి విమర్శగా కత్తి కూడా గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం కూడా విదితమే. ఈ వివాదానికి ముగింపు ఎలా పలకాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి రహస్యంగా ఒక సలహా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి దీన్ని మరింత పెద్దది గా చేయవద్దని, అభిమానులు అందరూ సంయమనం పాటించాలని, అనవసరంగా కత్తి మహేష్ ని సెలెబ్రిటీని చేయవద్దని, పవన్ తన భవిష్యత్ కార్యకలాపాల పైననే దృష్టి పెట్టాలని, అలాగే కత్తి మహేష్ ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా లైట్ గా తీసుకుంటున్నారని అన్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ టీం మాత్రం మెల్లగా కత్తి డొంక మొత్తం మెల్లగా కదిలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి…