టీం ఇండియా పరాజయం..ఐన్ స్టీన్ కు కూడా అర్థం కాదా..!

Tuesday, January 9th, 2018, 07:19:15 PM IST

అతి తక్కువ విజయ లక్షాన్ని కూడా ఛేదించలేక తొలిటెస్టులోనే పరాజయం పాలైన టీం ఇండియాపై విమర్శలు మొదలయ్యాయి. గెలిచినప్పుడు పొగడడం..ఓడినప్పుడు విమర్శించడం సాధారణమే. కానీ సెలెక్టర్ల విషయంలో కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఆలోచించే విధంగా ఉన్నాయి ఆలోచించే విధంగా ఉన్నాయి. కేప్ టౌన్ టెస్టులో బ్యాట్స్ మాన్ లంతా మూకుమ్మడిగా విఫలం అయ్యారు. బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసినా ఫలితం లేకపోయింది.

కాగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వైపే విమర్శకుల వేలు మళ్లుతోంది. దానికి కారణం వీరిద్దరూ టెస్టు మెటీరియల్ కాదనేది వారి వాదన. టెస్టులు టెస్టులే.. వన్డేలు వన్డేలే. సెలెక్టర్లు టెస్టుల కోసం బ్యాట్స్ మాన్ లని ఎంపిక చేసేటప్పుడు వన్డే లని, టి 20 లని ప్రామాణికంగా తీసుకోకూడదు. స్వదేశీ గడ్డపై వన్డేలు, టి 20 లలో రెచ్చిపోయి ఆడే రోహిత్, ధావన్ లని అంత్యంత క్లిష్టమైన సౌత్ ఆఫ్రికా గడ్డపై అందించడంలో సెలెక్టర్ల సిద్ధాంతం ఏమిటో ఐన్ స్టీన్ కు సైతం అర్థం కాదనే విమర్శలు ఎదురవుతున్నాయి. మాజీ కెప్టెన్ సిరప్ గంగూలీ.. మాట్లాడుతూ కేప్ టౌన్ టెస్టు పరాజయం బ్యాట్స్ మాన్ పుణ్యమే అని అభివర్ణించాడు. ధావన్ స్థానంలో కె ఎల్ రాహుల్ ని, రోహిత్ శర్మ స్థానంలో రహానే ని రెండవ టెస్టులో ఆడించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments