బిగ్ బ్రేకింగ్.. హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న 7.71కోట్లు..!

Wednesday, November 7th, 2018, 01:18:10 PM IST

తెలంగాణ ఎన్నిక‌ల వేళ‌ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నెం12లో ఒక అపార్ట్‌మెంట్‌లో దాదాపు 7.71కోట్ల రూపాయ‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్‌లో తనిఖీలు చేస్తుండ‌గా ఇద్ద‌రు అనుమానితుల్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా వారిచ్చిన స‌మాచారం ఆధారంగా న‌గ‌దును గుర్తించిన పోలీసులు.. అక్క‌డ ఉన్న డ‌బ్బుకి స‌రైన ఆధారాలు లేక‌పోవ‌డంతో ఆ మొత్తం డ‌బ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఢిల్లీ, ముంబై నుంచి హవాలా మార్గంలో డబ్బును తీసుకొచ్చివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ నుంచి ఈ డ‌బ్బును హైద‌రాబాద్ కి తీసుకువ‌చ్చిన‌ట్లుగా నిర్ధారించారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ నాయకులెవరైనా ఈ డబ్బును తెప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ‌బ్బు వెన‌క హ‌వాలా రాకెట్ ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఆ డ‌బ్బుకి సంబంధించిన వివరాలు క‌రెక్టుగా లేకపోవడంతో న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం.