7 మంది ప్రాణాలు బలిగొన్న జల్లికట్టు..!

Monday, February 13th, 2017, 11:02:45 AM IST


జల్లికట్టు పై బ్యాన్ విధించడంతో తమిళులు పోరాటం చేసి మరీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డినెస్ జారీ చేయించారు. జల్లికట్టు పై ఉన్న బ్యాన్ ని ఎత్తివేస్తూ కేంద్రం ఆర్డినెస్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తమిళులు చేసిన పోరాటం విజయం సాధించింది.దీనితో జల్లికట్టు జరగడానికి మార్గం సుమగం అయింది. కానీ జల్లికట్టు లో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఆదివారం రోజుమాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 7 మంది ప్రజలు జల్లికట్టు లో మరణించారు.

కృష్ణ గిరి జిల్లాలో ఇద్దరు మరణించగా, మధురై జిల్లాలో ఇద్దరు మరణించారు. మరో వేరువేరు ప్రాంతాల్లో ముగ్గురు జల్లికట్టు సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు. క్రిష్ణగిరి జిల్లాలో ఏ వ్యక్తి ఎద్దుని డీ కొట్టడంతో మరణించగా, మరో వ్యక్తి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మరణించాడు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం జల్లికట్టు జరిగే ప్రదేశం లో భారీ సంఖ్య లో జనాభా చేరుకోవడంతో,అక్కడ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెల్సుతోంది. ఆ ప్రదేశం లో బ్యారికేడ్లు కూడా లేవని తెలుస్తోంది. దీనితో తొక్కిసలాట జరిగి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.