గూగుల్ ఉద్యోగం కోసం ఏడేళ్ల చిన్నారి..!

Thursday, February 16th, 2017, 03:11:49 PM IST


మానవుని మేధస్సు, ఆసక్తి అనంతమైనవి. తమకు ఆసక్తి ఉన్న రంగంలో కష్టపడితే తప్పక విజయం సాధిస్తారనేది వాస్తవం. ఆదిశగానే అడుగులు వేస్తున్న ఏడేళ్ల బాలిక ఆసక్తి చూసి ఐటి దిగ్గజమైన గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ మురిసిపోయారు. గూగుల్ సంస్థ లో ఉద్యోగం చేయాలని చాలా మంది సాఫ్ట్ వేర్ లు కలలు కంటూంటారు. గూగుల్ లో ఉద్యోగం సాధించాలంటే కష్టంతో కూడుకున్న పని. అలాంటి సంస్థలో ఉద్యోగం కోసం ఏడేళ్ల బాలిక క్లో బ్రిడ్జ్ దరఖాస్తు చేసుకుంది. ఆ బాలిక ఆసక్తి మురిసిపోయిన సుందర్ పిచాయ్ వెంటనే రిప్లై ఇచ్చారు.

గూగుల్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నందుకు థాంక్స్. కస్టపడి చదివి, తన కలలను సాకారం చేసుకోవాలని, విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అధికారికంగా గూగుల్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ చిన్నారిని ప్రోత్సహించారు. తాను స్కూల్ లో కూడా మంచి విద్యార్థినని, తనకు కంప్యూటర్స్, రోబోట్స్, టాబ్లెట్స్ అంటే చాలా ఆసక్తి అని ఆ చిన్నారి గూగుల్ సీఈఓకి రాసిన లేఖలో పేర్కొంది. తన కూతురికి ఉన్న ఆసక్తిని గమనించిన క్లో బ్రిడ్జ్ తండ్రి గూగుల్ లో అప్ప్లై చేసేలా సాయపడ్డారు. తనకు గూగుల్ లో ఉద్యోగం చేయాలని ఉన్న ఆసక్తిని లేఖలో పేర్కొంది. దీనికి సుందర్ పిచాయ్ వెంటనే స్పందించడం విశేషం. ”కంప్యూటర్స్, రోబోట్స్ పట్ల నీకున్న ఆసక్తి సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో నీవు టెక్నాలజీ ని బాగా నేర్చుకుంటావు” అని సందేశం పంపారు