కేటీఆర్ కి కాంగ్రెస్ నేత ఇచ్చిన కొత్త బిరుదు ఏంటో తెలుసా..!!

Tuesday, September 26th, 2017, 10:00:54 PM IST

మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వక్బాణాలని సంధించారు. కేటీఆర్ కు మిస్టర్ ఫెయిల్యూర్ అనే బిరుదు అతికినట్లు సరిపోతుందని అన్నారు. టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో కేటీఆర్ హామీలని నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. అవార్డుల ద్వారా ప్రచారం చేసుకోవడం. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం లో మాత్రమే కేటీఆర్ విజయం సాదించినట్లు షబ్బీర్ అలీ అన్నారు. టిఆర్ ఎస్ పార్టీ అధికారం లోకి వస్తే కొత్త ఎన్నారై పాలసీని తీసుకుని వస్తామని టిఆర్ ఎస్ నేతలు తెలిపారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ విషయం గురించి ఊసే ఎత్తడం లేదని అన్నారు.

విదేశాల్లో తిరుగుతున్న కేటీఆర్ కు గల్ఫ్ దేశాలలోని ఎన్నారైల ఇబ్బందులు కనిపించడం లేదా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన 30 వేలమంది ఎన్నారైలు గల్ఫ్ దేశాలలో తీవ్ర ఇబ్బదులు పడుతున్నారని అన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. గల్ఫ్ భాదితులను ఆదుకోవడానికి రాబోవు అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments