తెలంగాణాలో కెసిఆర్ మోసాల్ని బయట పెడతాం..కాంగ్రెస్ జెండా పాతుతాం.

Thursday, September 13th, 2018, 03:10:55 PM IST

తెలంగాణా రాష్ట్రం లో ఎన్నికల వేడి రోజురోజుకి ఎక్కువవుతున్న కొద్దీ చాలా ఆసక్తి నెలకొంటుంది. ఇందులో భాగం గానే అక్కడి కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద విమర్శల జల్లు గుప్పించారు. అయితే వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ తెలంగాణా ప్రజలకు చేసిన అన్యాయాన్ని బయటబెట్టి కాంగ్రెస్ జెండా పాతుతాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణాలో అలీ కాంగ్రెస్ ప్రచార నిమిత్తం ముఖ్యమంత్రి కెసిఆర్ మీద నిప్పులు చెరిగారు. రెండు అంశాల మీద ప్రచారం చేస్తున్నాం అని, కెసిఆర్ మోసగాడు, ఆయన ప్రజల్నిఎలా మోసం చేశాడు అనే నినాదంతో ప్రారంభిస్తున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఆయన చేసిన మోసపు హామీల్లో రెండు పడకల గది ప్లాట్లు ఎవరికీ రాలేదో అవి మేము కట్టిస్తాం అని, పెద్దవాళ్ళకి ఆయన ఇవ్వనటువంటి మూడు ఎకరాల భూముల్ని మేము ఇస్తాం, రేషన్ లో ఆయన ఇచ్చే లావాటి బియ్యాన్ని మార్చి సన్నని బియ్యం ఇస్తామని అంతే కాకుండా, నిరుద్యోగులకు వారికి ఉద్యోగాలు వచ్చేవరకు నెల నెలా 3000 వేల రూపాయల భృతి చెల్లిస్తాం అని, ఇంకా ఆయన ఇచ్చిన ఎన్నో మోసపూరిత హామీలను తాము అధికారం లోకి వచ్చాక నెరవేరుస్తాం అని తెలిపారు. గడిచిన ఏళ్లలో కెసిఆర్ ఒక్క సారి కూడా జనాన్ని కలవడానికి వెళ్ళలేదు అని తెలిపారు. ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోకుండా అద్దాల మేడల్లో ఉంటా అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments