“సాహో” నుంచి మరో సర్ప్రైజ్ కి సిద్ధమా..?

Monday, February 11th, 2019, 11:00:11 PM IST

యంగ్ రెబెల్ స్టార్ డార్లింగ్ హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం “సాహో”.బాహుబలి సినిమా తర్వాత అని కాదు కానీ ఈ సినిమాకి కూడా ఒక ప్రత్యేకమైన హైప్ వచ్చింది.ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తక్కువే అయినా సరే ఆ తక్కువతోనే అంచనాలను తారా స్థాయికి ఈ చిత్ర యూనిట్ తీసుకెళ్లిపోయారు.ఈ సినిమా కోసం సుజీత్ ఎక్కడా కూడా రాజీ పడకుండా భారీ తారాగణంనే ఎంచుకుంటున్నారు.మొన్ననే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారు.దానితో మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందని సినీ వర్గాల నుంచి సమాచారం.ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో” అనే ఒక మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ నుంచి ఆ వీడియోకి కొనసాగింపుగా “షేడ్స్ ఆఫ్ సాహో” 2 మేకింగ్ వీడియోని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ వీడియోని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.మొదటి వీడియోతోనే ప్రకంపనలు సృష్టించిన డార్లింగ్ ఈ రెండో వీడియోతో ఎలాంటి విధ్వంసం చేస్తాడో చూడాలి.