గూస్ బంప్స్ “షేడ్స్ ఆఫ్ సాహో”..ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..!

Tuesday, October 23rd, 2018, 11:50:13 AM IST

ఈ రోజు “యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్” అభిమానులకు రెండు పండగలు అని చెప్పాలి.మొదటిది వారి అభిమాన నటుడు ప్రభాస్ యొక్క పుట్టిన రోజు అయితే మరొకటి వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న “సాహో” చిత్రం నుంచి వచ్చిన కనీ వినీ ఎరుగని రీతిలో ఇచ్చిన “షేడ్స్ ఆఫ్ సాహో” నుంచి ఒక చిన్న మచ్చు తునక.ఈ 1నిమిషం 23 సెకెన్లు నిడివి ఉన్న వీడియో మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో వీరంగం చేస్తుంది.ప్రభాస్ అభిమానులు ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి నిరీక్షణకు ప్రభాస్ చాలా పెద్ద బహుమతిని ఇప్పుడు అందించినా ఇది చాలా చిన్నదే అని చెప్పాలి.

ఎందుకంటే ఇది జస్ట్ మేకింగ్ వీడియో లాంటిది.అదే ఏ టీజరో లేక ట్రైలరో విడుదల చేసి ఉంటే వేరే రేంజ్ లో ఉంటుంది.ఈ వీడియోని గమనించగా సుజీత్ తన రెండవ సినిమా అయినా సరే ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పాలి.మొత్తం యాక్షన్ సీన్లతోనే నడిచే ఈ వీడియో చివర్లో ప్రభాస్ అలా నడిచి వచ్చే సీన్ చూస్తే అతని అభిమానులకు ఖచ్చితంగా వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఉంటాయి.ఇక మొత్తంగా చెప్పాలి అంటే ప్రభాస్ అభిమానులు ఈ ఒక్క గ్లిమ్ప్స్ తో కాలర్ ఎగరెయ్యొచ్చు..

  •  
  •  
  •  
  •  

Comments