ఖాన్ గారికి కోపం ఎక్కువే..అభిమానితో గొడవ పడ్డ షారుఖ్..!

Tuesday, September 20th, 2016, 12:47:26 PM IST

srk
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరోమారు వివాదంతో వార్తల్లోకెక్కాడు.తన అభిమానితో షారుఖ్ గొడవపడిన వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం ది రింగ్ కోసం ఆమ్స్టర్ డామ్ లో షూటింగ్ లో ఉన్నాడు.అక్క డ కొంతమంది అభిమానులు షారుఖ్ ని కలిసేందుకు ప్రయతించారు. ఈ సందర్భంగా ఓ అభిమానితో గొడవపడ్డాడు.వారి మధ్య చిన్నపాటి తోపులాట జరిగినట్లు ఈ వీడియో లో తెలుస్తోంది.

కొంతమంది అభిమానులు షారుఖ్ ఖాన్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు.షారుఖ్ బాడీగార్డ్స్ అభిమానులను వెనిక్కి నెట్టే ప్రయత్నం చేయారు. కానీ ఓ అభిమాని మాత్రం అత్యుత్సాహంతో షారుఖ్ భుజం పై చేయివేసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.దీనితో తీవ్ర కోపానికి గురైన షారుఖ్ అతడితో చిన్నపాటి ఘర్షణకు దిగాడు.షారుఖ్ బాడీగార్డ్స్ కలగా జేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. షారుఖ్ కు చిన్నపాటి ఘటనలకే తన సహనాన్ని కోల్పోతుంటాడు. షారుఖ్ ఇలా గొడవ పడడం ఇదేమి తొలిసారి కాదు.2012 లో ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా ముంబయి వాంఖడే స్టేడియం లో ఓ సెక్యూరిటీతో షారుఖ్ గొడవ పెట్టుకున్న ఘటన తెలిసిందే.