షారుక్ ఖాన్ ని ప్రశంసించిన రజనీకాంత్

Saturday, August 10th, 2013, 09:39:43 AM IST

ఈ మద్య విడుదలైన షారుక్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్. ఈ సినిమాని తమిళంలోకి కూడా డబ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా తమిళ వర్షన్ లో ‘మూచొంఖో రౌండ్ గుమాకే, అన్నా కే జైసా చస్మా లగాకే, కోకోనట్ మే లస్సీ మిలాకే, ఆ జావో మూడో బనాకే.. ఆల్ ద రజనీ ప్యాన్స్, డోంట్ మిస్ ద చాన్స్… లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్’ అంటూ రజనీకాంత్ పై ఒక పాటని చిత్రీకరించడం జరిగింది. ఈ పాట ద్వారా షారుక్ తనుకు రజనీపై ఉన్న అబిమానాన్ని చాటుకున్నాడు. అయితే నిన్న కుటుంబ సమేతంగా ఈ పాటకు సంబందించిన వీడియో యూటుబ్ లో చూసిన రజనికాంత్ షారుక్ ఖాన్ కు ఫోన్ చేసి చాలా బాగుందని చాలా స్వీట్ గా ఉందని, చిలిపిగా ఉందని ప్రశంసించాడని షారుక్ తెలియజేశాడు.

అయితే ఈ పాట చిత్రీకరణకు ముందు రజనీకాంత్ ని, అతని కూతురుని పాట చిత్రీకరణ గురించి అనుమతిని తీసుకున్నడని తెలిసింది. ఈ పాటని హానీ సింగ్ పాడారు. అయితే ఈ విషయాన్ని అడగటానికి వెళ్ళినప్పుడు అయన తనతో ‘మీరు బాలీవుడ్ సూపర్ స్టార్ కదా మరి నాపై పాటని ఎందుకు చిత్రీకరించాలనుకుంటున్నారని అడిగాడని అది నిజంగా అయన గొప్ప గుణానికి నిదర్శనం అని షారుక్ అన్నాడు. అయితే ఆయన గురించి ప్రస్తావించడానికి ఇన్ని రోజులకు అవకాశం వచ్చిందని ఈ సినిమాలో తలైవా గురించి చెప్పక పొతే ఈ సినిమాకి అర్థం ఉండదని అన్నాడు.