ఐఏపీఎల్ లో షారుక్ కూతురు సందడి…

Monday, April 9th, 2018, 11:28:09 AM IST

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ , గౌరీల గారాల ప‌ట్టి సుహానా ఖాన్ యూత్ హార్ట్‌త్రోబ్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్వ‌ర‌లో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని కూడా చెబుతున్నారు. 17 ఏళ్ల సుహానా ప్రస్తుతం ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నది. అయితే నిన్న కోల్‌క‌తాలో ఆర్సీబీ, కేకేఆర్ టీంల మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌గా స్టేడియంకి త‌న తండ్రి షారూఖ్‌తో క‌లిసి సుహానే వ‌చ్చింది.

గ్యాల‌రీలో సుహానేని చూసిన క్రికెట్ ప్రేమికులు స్టేడియం ద‌ద్ద‌రిల్లేలా గోల చేశారు. కేకేఆర్ టీం స‌భ్యులు ఫోర్‌ లేదా సిక్స‌ర్ కొట్టిన‌ప్పుడు ఈ అమ్మ‌డి హావ‌భావాలు కెమెరాలో బంధించ‌బ‌డ్డాయి. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇప్పటికే తండ్రి షారుక్ కూడా సుహానా నటి కావాలని అనుకుంటున్నదని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఇక త్వరలోనే ఆమె తెరంగేట్రం ఖాయంగా కనిపిస్తున్నది. షారుఖ్ కొడుకు 19 ఏండ్ల ఆర్యన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఫిలిం కోర్స్ చేస్తున్నాడు. ఇక.. అందరికంటే చిన్నవాడు 4 ఏండ్ల అభ్‌రామ్ కూడా స్కూలింగ్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments