రోజుకు రూ.20 వేలు ఇస్తామన్నారు.. బాధగా అనిపించింది : షకీలా

Monday, July 23rd, 2018, 07:22:34 PM IST

అప్పట్లో మలయాళం సినిమాలతో సరికొత్త ట్రెండ్ చేసిన షకీలా గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు మలయాళం స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకొని తన సినిమాలతో గట్టిపోటీని ఇచ్చేది. అయితే అవకాశాలు తగ్గడంతో ఆమె కెరీర్ డౌన్ అయ్యింది. ఆర్థికంగా కూడా చాలా ఇబందుల్లోకి వెళ్లారు. అయితే సినిమా అవకాశాలు అప్పుడ్డప్పుడు వస్తుంటే చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఆమెకు ఒక బాలీవుడ్ లో నటించే అవకాశం దొరక్కగానే గతంలో నో చెప్పినట్లు ఇటీవల వివరణ ఇచ్చారు.

2013లో షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాలో సత్యరాజ్ పక్కన నటించే అవకాశం రాగా ఆడిషన్స్ కి వెళ్లినట్లు చెప్పారు. అయితే రెమ్యునరేషన్ చెప్పి తనను చాలా అవమానానికి గురిచేశారని షకీలా వివరించారు. సత్యరాజ్ పక్కనే ఉండగా ఒక్కరోజుకి 20వేలు మాత్రమే ఇస్తామని చిత్ర యూనిట్ చెప్పడంతో తలకొట్టేసినంత పనైందని తెలుపుతూ.. ఒక భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలో నాకు ఆ విధంగా రెమ్యునరేషన్ ఇవ్వడం నచ్చలేదని షకీల పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments