షాకింగ్ న్యూస్ : టీడీపీ నేత కుమారుడి హత్య

Monday, May 14th, 2018, 11:27:47 PM IST


అభం శుభం తెలియని ఏడేళ్ల బాలుడి హత్య శ్రీకాకుళంలో నేడు తీవ్ర కలకలం రేపింది. విషయంలోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా సరవకోట మండలం, గుమ్మపాడు ప్రాంతానికి చెందిన స్థానిక టీడీపీ నేత కత్తిరి వెంకటరమణ కుమారుడు ఏడేళ్ల హర్షవర్ధన్ ను కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా విషయం తెలుసుకున్న వెంకటరమణ, ఆయన భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయనకు వున్న పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడి సేవాణ్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపారు.

అయితే అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనే దానిపై వెంటనే విచారణ ప్రారంబిస్తున్నామని, చిన్న బాలుడిని అంత కిరాతకంగా చంపడం దారుణమని, నింధితులను అతి త్వరలో పట్టుకుంటామని స్థానిక ఎస్ఐ అంటున్నారు. కాగా వెంకటరమణ కుమారుడి మృతి విషయం తెలుసుకున్న శ్రీకాకుళం టీడీపీ నేతలు ఒక్కోరొక్కరుగా ఆయన నివాసానికి చేరుకొని హర్షవర్ధన్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కర్కశంగా హత్య గావించిన వారిని పట్టుకునే వరకు ఊరుకునేది లేదని వారు పట్టుపడుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments