ఆయన ప్రెస్ మీట్ పెడితే దేశం మొత్తం అల్ల కల్లోలం..!

Saturday, November 19th, 2016, 02:15:36 PM IST

rbi
చూడడానికి బక్క పలచగా ఉంటాడు .. గాలోస్తే ఎగిరిపోయే వ్యక్తిలాగా ఉంటారు కానీ ఆయన్ని చూస్తేనే జనాలు ఇప్పుడు భయపడుతున్నారు. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరవాత కీలక విషయాలు అన్నీ ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెబుతున్నారు ఈయన. స్వల్ప కాలం లో దేశం అంతా ఫేమస్ అయిన కేంద్ర ఆర్ధిక వ్యవహారా శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఇప్పుడు న్యూస్ లో నిలిచారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీ సారీ గవర్నర్ ని సైతం డామినేట్ చేసి మాట్లాడే ఆయన ధోరణి కాస్త ఆసక్తికరంగానే ఉంది. కావాల్సిన విషయాలు విడమర్చి చెబుతున్నారు దాస్. డిల్లీ లోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి ఎంయే చేసిన ఆయన తమిళనాడు లో ఐయేఎస్ అధికారికంగా ఎంపిక అయ్యారు. ఒరిస్సా నుంచి వచ్చినా తమిళనాడు కేదార్ లో పని చేసారు. 2009లో కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అంతకు ముందు ఆయన తమిళనాడు పరిశ్రమల శాఖలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఎల్ ఐసీ.. ఓన్ జీసీ లాంటి సంస్థలకు డైరెక్టర్ గా పని చేసిన ఆయన.. గత సెప్టెంబరు నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.