భార్యకు మెసేజ్ చేసిన షమీ… ఏమన్నాడంటే?

Tuesday, April 10th, 2018, 05:55:49 PM IST

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ, అతడి భార్య హసీన్ జహాన్‌కు మధ్య గత కొద్దీ రోజులుగా పెద్ద వివాదమే జరుగుతుందని చెప్పాలి. ఇటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో భార్యకు షమీ ప్రేమగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ, మిస్‌యూ అని పేర్కొన్నాడు. కేక్ బొమ్మను పోస్టు చేసిన షమీ, ‘నా బెబోకు నాలుగో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

మిస్ యూ’ అని రాసుకొచ్చి భార్యపై ప్రేమ ఇంకా తగ్గిపోలేదని నిరూపించాడు. షమీ పోస్టుపై అభిమానులు ఫైరవుతున్నారు. ఆమెది శుభాకాంక్షలు అందుకునేంత గొప్ప క్యారెక్టర్ ఏమీ కాదని మండిపడుతున్నారు. ఆమెకు అంత గొప్ప వ్యక్తిత్వం లేదని, ఆమె కాదనికొందరు కామెంట్ చేస్తున్నారు. షమీ తనను వేధిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, అతడికి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ విషయమై షమీ పై కేసు నమోదు చేసిన పోలీస్ లు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు…..

  •  
  •  
  •  
  •  

Comments