తన అన్నని గదిలోకి పంపాడు.. షమీ భార్య షాకింగ్ కామెంట్స్

Sunday, March 11th, 2018, 02:00:16 PM IST

క్రికెటర్ షమీ భార్య వివాదం రోజు రోజుకు తారా స్థాయికి చేరుతోంది. రోజుకో కామెంట్ తో షమీ సతీమణి సంచలనం సృష్టిశోస్తోంది. ఇప్పటికే షమిపై కోల్ కత్తా పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. భార్య చెప్పిన దాని ప్రకారం గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే రీసెంట్ గా షమీ భార్య హసిన్ ఎవరు ఉహించనిక్ విధంగా మరో కామెంట్ చేసింది. షమీ సోదరుడు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించే వాడని తెలుపుతూ..షమీ కూడా అతనికి మద్దతు ఇచ్చేవాడని చెప్పింది.

ఒక్కోసారి షమీ తన గదిలోకి అతని సోదరుడిని పంపి బయట నుంచి తాళం వేశేవాడని హాసిన్ వివరించింది. అంతే కాకుండా నిత్యం మాటలతో ఎంతో వేధించేవాడని నువ్వు మోడల్ అలాగే రెండో పెళ్లి చేసుకున్నావ్ అలాంటి అలవాట్లు ఏమి కాదని నిత్యం నరకం చూపించించేవాడని షమీ భార్య చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. షమీ మాత్రం తనకు ఎలాంటి పాపం తెలియదని చెబుతున్నాడు. అసలు షమీ నిజంగానే తప్పు చేసినట్లయితే అతనికి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments