షమీ బిసిసిఐని మోసం చేశాడు : షమీ భార్య

Sunday, April 29th, 2018, 01:35:01 AM IST

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్‌ షమీ అతని భార్య హసీన్‌ జహాన్‌ల మధ్య వివాదం రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయగా బిసిసిఐ అతను ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించింది. అయినప్పటికీ అతని భార్య అతనిపై ఆరోపణలను ఏ మాత్రం ఆపడం లేదు. ఇక రీసెంట్ సోషల్ మీడియా ద్వారా ఆమె సంచలన విషయాన్నీ చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది. షమీ పుట్టిన రోజు విషయంలో బిసిసిఐ ని మోసం చేశాడని ఆరోపణలను చేసింది.

నకిలీ బర్త్‌ డే సర్టిఫికేట్‌లతో వివిధ కెటగీరిల జాతీయ మరియు రాష్ట్రీయ టోర్నీల్లో షమీ ఆడాడని చెప్పిన హసీన్ షమీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫొటోను ఫెస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే ఏమైందో ఏమో గాని మరికొన్ని నిమిషాలకే ఆ పోస్ట్ తొలగించడమే హాట్ టాపిక్ గా మారింది. షమీ పుట్టిన సంవత్సరం 1990 అని ఉండగా హాసిన్ పోస్ట్ చేసిన లైసెన్స్ లో 1982 అని ఉంది. నకిలీ సర్టిఫికెట్స్ తో షమీ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(క్యాబ్‌)లతో పాటు బిసిసిఐ ను కూడా మోసం చేసి అండర్ 22 క్రికెట్ టోర్నీలో ఆడినట్లు ఆమె అరోపణలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments