పోర్న్ స్టార్ తో షేన్ వార్న్ ఆ పని చేసాడు! బుక్ అయ్యాడు!

Sunday, September 24th, 2017, 07:29:36 PM IST


ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఆటగాడు. వరల్డ్ ఫేమస్ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి అందరికి భాగా తెలిసే ఉంటుంది. ఆయన క్రికెట్ ని ఎంతగా ప్రేమిస్తాడో అమ్మయిలతో సంబంధాలు అంతగా పెట్టుకుంటాడు. అప్పట్లో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకి వచ్చి అతని పరువు బజారుకి ఈడ్చింది. అతనికి అమ్మాయిలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని అతని భార్య కూడా వదిలిపోయింది. గతంలో ఒకసారి హాస్పిటల్ నర్స్ తో మిస్ బిహేవ్ చేస్తూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అలాంటి సంఘటనతో మరో సారి వార్తల్లోకి వచ్చాడు. ఓ పోర్న్ స్టార్ మీద అకారణంగా చెయ్యి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె అతని మీద పోలీస్ కేసు పెట్టింది. ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి అతని పరువు తీసింది.

గత శుక్రవారం సెంట్రల్ లండన్ లో ఓ నైట్ క్లబ్ లో షేన్ వార్న్ పోర్న్ స్టార్ వేలేరీ ఫాక్స్ తారసపడ్డారు. అప్పటికే ఫుల్ గా తాగి ఉన్న వార్న్ వేలేరీతో అసభ్యంగా బిహేవ్ చేయడంతో పాటు బలంగా కొట్టడంతో ఆమె క్రింద పడిపోయింది. అనంతరం ఆమె వార్న్ మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది. దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, నువ్వు ఎంత పెద్ద స్టార్ అయిన కావచ్చు, కాని ఒక మహిళ మీద దాడి చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నావా. తప్పు చేసి తప్పించుకోగలను అనుకుంటున్నావ… అస్సలు తప్పించుకోలేవు అంటూ హెచ్చరికలు కూడా చేసింది. ఇప్పుడు ఈమె కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఆమె కామెంట్స్ మీద పోలీసుల ఫిర్యాదు మీద షేన్ వార్న్ ఏమంటాడో చూడాలి.

Comments