3.0పై క్లారిటీ ఇచ్చిన శంకర్..!

Thursday, December 6th, 2018, 09:28:14 AM IST

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ ల కాంబినేషన్ లో రోబోకు సీక్వెల్ గా వచ్చిన 2.0 సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుండే దీనికి సీక్వెల్ గా 3.0 రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి, 2.0లో చిట్టి స్తానంలో చిన్ని (తమిళ్ లో కుట్టి), ఉండబోతుందని హింట్ ఇస్తూ ముగించటమే ఇందుకు కారణం. ఆలా శంకర్ ఇచ్చిన హింట్ తో, అభిమానులు ప్రేక్షకులు ఎవరికీ తోచిన కథను వారు రాసుకుంటున్నారు. దర్శకుడు శంకర్ 2.0 సినిమాకు సీక్వెల్ కచ్చితంగా తీస్తాడని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడిన శంకర్, 2.0 సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూ, ఎదో తీయాలంటే తీసినట్టు సీక్వెల్ సినిమాలు తీయం అని, ఒక్కోసారి అలా జరిగిపోతుంటాయని అన్నారు. సీక్వెల్ తీయాలంటే సరైన కథ కుదరాలి అన్నారు, తన సినిమాలు ఓపెన్ ఎండింగ్ గా ఉంటాయని అన్నారు. 2.0 విషయంలో పాత్రలకు తగిన తారాగణం కుదిరిందని, తరవాతి సినిమాకు కూడా అలా మంచి స్క్రిప్ట్, దానికి తగిన తారాగణం కుదిరితేనే సీక్వెల్ తీస్తానని చెప్పుకొచ్చారు. టెక్నాలజీని కూడా స్క్రిప్ట్ డిమాండ్ చేసినంత మేరకే వాడతానని శంకర్ అన్నారు. దీంతో కొన్ని రోజులుగా 2.0కు సీక్వెల్ ఉండబోతుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు శంకర్. దీన్ని బట్టి చుస్తే ఇప్పట్లో 2.0కు సీక్వెల్ లేనట్లే అన్నమాట.