రజనీకాంత్ కంటే శంకరే గొప్పవాడంట..!

Saturday, December 27th, 2014, 11:23:53 PM IST

varma-rajini
వివాదాస్పద కేంద్రబిందువైన, సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జయలలిత కంటే, రజనీకాంత్ కంటే కూడా శంకరే గొప్పవాడని చెప్పారు. శంకర్ ‘ఐ’ ట్రైలర్ చూసిన తర్వాత, తన భావాన్ని వ్యక్త పరిచారు. ఇక ‘ఐ’ చిత్రం రెండో ట్రైలర్ చూసిన ఆయన, ఈ సంక్రాంతి కాస్తా శంకర్ రాత్రిగా అయిపోతుందన్నారు. రజనీకాంత్ కంటే శంకర్ చాలా గొప్పవాడని, ఆయన సినిమా చూస్తే ఒకరకమైన విద్యుత్ పుట్టి ఆసక్తి రేపుతుందన్నారు. ఐ సినిమా మొదటి రోజు కలెక్షన్లు లింగా కలెక్ష్న్లను మించి పొతుందని, అందుకే తాను రజనీకాంత్ కంటే శంకర్ గొప్పవాడని అంటున్నానని చెప్పారు. ఇన్నాళ్లూ తాను రజనీకాంత్ కు పెద్ద అభిమాననని, కానీ ఇప్పుడు శంకర్ వైపు మారిపోయానని వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.