శ్రీశాంత్, చవాన్ లపై జీవితకాల నిషేధం

Friday, September 13th, 2013, 05:38:37 PM IST

sports
ఐపీఎల్ స్పాట్ ఫిక్సర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. శ్రీశాంత్, అంకిత్ చవాన్‌పై బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించింది. అమిత్ సింగ్‌పై ఐదేళ్ల పాటు, సిద్ధార్థ్ త్రివేదిపై ఏడాది పాటు బీసీసీఐ నిషేధం విధించింది.శుక్రవారం బిసిసిఐ క్రమశిక్షణా సంఘం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారు ఇక క్రికెట్ ఆడే అవకాశాలు లేనట్లే. సాక్ష్యాలు లేకపోవడంతో హర్మీత్ సింగ్‌పై కేసును మూసేశారు. ఐపియల్ ఆరో ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తేల్చింది. తిరిగి జాతీయ జట్టులోకి వస్తానని ఆశపడిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఆశలు దీంతోనే గల్లంతయ్యాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లకు గతంలో బెయిల్ రాగా, అజిత్ చండిలకు ఇటీవలే బెయిల్ లభించింది. వారు ముగ్గురు కూడా బెయిల్‌పై బయటే ఉన్నారు.