జ‌గ‌న్ సంచ‌ల‌నం.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగనున్న‌ ష‌ర్మిల.. సెంట‌ర్‌లో ప‌క్కా రీసౌండ్..?

Tuesday, January 29th, 2019, 04:55:30 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్య‌ర్ధుల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తం 25 ఎంపీ సీట్లు కొట్టాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇక మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో పార్ల‌మెంట్ అభ్య‌ర్ధ‌లు ఎంపిక విష‌యంలో జ‌గ‌న అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌కాశం జిల్లాలో ఎంపీ స్థానాన్ని గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్ధి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పై వైసీపీ అభ్య‌ర్ధి వైవీ సుబ్బారెడ్డి గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ ష‌ర్మిల‌ను అక్క‌డ బ‌రిలోకి దించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ముందుగా క‌డ‌ప లోక్‌స‌భ నుండి ష‌ర్మిల‌ను పోటీ చేయించాల‌ని భావించినా, అక్క‌డ జ‌గ‌న్ సోద‌రుడు వైఎస్ అవినాష్‌రెడ్డి లేక‌పోతే ప‌రిస్థితులు మారిపోతాయ‌ని భావించిన జ‌గ‌న్ ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ బంధువైన వైవీ సుబ్బారెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపించి, ష‌ర్మిల‌ను, ఒంగోలు పార్ల‌మెంట్ స్థానం నుండి పోటీ చేయించాల‌ని, వైసీపీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చించిన‌, జ‌గ‌న్ తుది నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ష‌ర్మిల‌ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.