అవసరానికి మించి తల దూర్చనంటున్న శర్వానంద్..!

Tuesday, November 13th, 2018, 08:22:48 PM IST

భిన్నమైన కథల ఎంపికతో, విభిన్నమైన నటనా శైలితో హీరోగా ప్రస్థానం మొదలుపెట్టిన కొద్దికాలానికే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు హీరో శర్వానంద్. ఆచి తూచి కథలు ఎంచుకుంటూ నిదానమే ప్రదానం అన్న రీతిలో ముందుకెళ్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది . ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ ఆడియో సింగిల్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన శర్వానంద్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

ఈ తరం హీరోలు కథల విషయంలో, స్క్రిప్ట్ రూపకల్పన విషయంలో అవసరానికి మించి తల దూరుస్తున్నారన్న ప్రశ్నకు స్పందించిన శర్వానంద్, ‘నా వరకు సినిమా వన్ మ్యాన్ షో అంటే నమ్మను, ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటా, ప్రతీది సరిగ్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాను, అందుకే అనుకున్న విదంగా సినిమా రాకపోతే దర్శకుడికి చెప్పేందుకు మొహమాట పాడను”. అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పడి పడి లేచే మనసు విడుడలకు ముస్తాబవుతుండగా, శర్వా సుదీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు విరాట పర్వం అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పడి పడి లేచే మనసు తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది. మొత్తానికి సినిమా హిట్టు, ఫ్లాపుల విషయంలో హీరోలకు కూడా బాధ్యత ఉంటుంది అంటున్న శర్వానంద్, సినిమా స్క్రిప్ట్, కథల విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టే హిట్లు కొట్టగలుగుతున్నాడేమో.