భయమే ఆమె ప్రాణాలు తీసింది!

Saturday, May 5th, 2018, 12:03:43 AM IST

ఇటీవల చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాగా నేడు ఒక వివాహిత మహిళ భయంతో తన కుమార్తె తో సహా ఉరివేసుకుని మరణించింది. విషయం లోకి వెళితే, కర్నూల్ జిల్లా చిప్పగిరి మండలం, సంగాల గ్రామంలో ని శివరుద్ర అనే వ్యక్తితో సునీతకు 2015 ఏప్రిల్ లో వివాహం జరిగింది. తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. కాగా పెద్ద కుమార్తెకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పలువురు వైద్యులకు చూపించినప్పటికీ ఫలితంలేకపోవడంతో సునీత కొంత ఆవేదనకు లోనైంది.

అంతేకాక వారి ఇంటిప్రక్కన వున్న ఇంట్లో ఇటీవల ఒక మహిళా ఆత్మహత్య చేసుకోవడంతో, ఆ మహిళా తనకాలలోకి వస్తోందని, మనసులో తెలియని భయగంగా ఉంటోంది అని భర్త శివారుద్రతో, అత్తమామలతో చెప్పేది. అయితే కొద్దిరోజుల క్రితం సునీతను తన పుట్టింటికి పంపాడు ఆమె భర్త. అయితే అక్కడ తల్లితండ్రులకు కూడా ఆ మహిళా కాళ్ళోకి వస్తున్న విషయం సునీత చెప్పింది. అయితే నిన్న సునీతను తిరిగి ఇంటికి తీసుకువచ్చిన శివారుద్ర తెల్లవారుజానమున గొర్రెల మందను మేపటానికి బయటకు వెళ్లిన సమయంలో పెద్ద కుమార్తె తో కలిసి సునీత ఇంటిదూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తెల్లవారాక వారిద్దరిని గమనించిన స్థానికులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బయటినుండి తిరిగివచ్చిన శివారుద్ర సునీతను, పెద్దకుమార్తెను చూసి బోరున విలపించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆ ముందురోజు సునీత తల్లిదగ్గరే ఆమె చిన్న కుమార్తె ఉండడంతో ఆమె ప్రాణాలు మిగిలాయని గ్రామస్థులు అంటున్నారు. అయితే సునీతకు వున్న భయం కారణంగా తనను, తాను చెపుతున్న మాటలను ఎవరూ పట్టించుకోకపోవడం. అలానే పెద్దకుమార్తెకు మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఆవేదనతో ఆత్మహత్య చేసుకుందని పోలీస్ లు చెపుతున్నారు. ఆమె మృతితో సంగాల గ్రామం లో విషాద ఛాయలు అలముకున్నాయి…..