ఆమెకు ఉదయం పెళ్లి అయింది….. సాయంత్రం కనిపించకుండా మాయమయింది!

Tuesday, May 29th, 2018, 02:32:25 PM IST

కాలం మారింది అలానే యువతీ యువకుల జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతీ యువకులు కేవలం అది అవసరం కోసం చేసుకుంటున్నాం అనుకుంటున్నారో ఏమో కానీ మొన్న కడప జిల్లాలో ఉదయం పెళ్లి చేసుకున్న నవ వధువు సాయంత్రానికల్లా మాయం అవడం ఆ ప్రాంత వాసులను కలవర పెడుతోంది. ఇక విషయంలోకి వెళితే, కడపలోని రాజంపేట మండలపరిధిలోని అత్తిరాల గ్రామం, వినాయక నగర్ లోని రమణమ్మ అనే ఆవిడ తన ఒక్కగానొక్క కూతురు సునీతకు ఈనెల 25న వెంకట సుబ్బయ్య అనే యువకునితో బంధువులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది. ఇక పెళ్లి తంతు ముగిశాక పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె ఇద్దరు సాయంత్రానికి అమ్మాయి ఇంటికి చేరుకున్నారు.

అయితే అందరితోపాటు భోజనం చేసిన తరువాత ఆరుబయట అటుఇటు తిరుగుతున్న పెళ్లికూతురు సునీత, అకస్మాత్తుగా కనిపించకుండా మాయమయింది. అయితే సునీత ఎక్కడికి వెళ్లిందా అని పెళ్ళికొడుకు, అతని బంధువులు, ఆమె తల్లి సహా అందరూ వీధి, వీధుల కలియతిరగ సాగారు. అయినప్పటికీ ఆమె జాడ కనిపించకపోవడంతో వారు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సునీత మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు, ఆమె ఇదివరకు ఎవరినైనా ప్రేమించిందా, లేదా, ఆమెకు వొళ్ళో ఎవరెవరితో సంబంధాలు వున్నాయి. అలానే ఆమె స్నేహితుల వివరాలను సేకరిస్తున్న పోలీస్ లు ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు. అయితే ఇప్పటివరకు ఆమె జాడ తెలియలేదని, బంధువులు కంగారుపడవలసిన అవసరం లేదని, వీలైనంత త్వరలోనే ఆమె ఆచూకీ కనుక్కుందామని వారు చెప్తున్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments